సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ (SCTP)
(ఉచిత సర్టిఫికేషన్ కోర్సు - 25వ బ్యాచ్ 2023 - తెలుగు మీడియం)
ఆన్లైన్ నమోదు పత్రము
కోర్సు తేదీలు:
15 నవంబర్ నుండి 24 నవంబర్ 2023 వరకు
సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ (SCTP) అనేది నవ్య తక్షశిల ఆత్మావిద్యా పీఠం (NTAP) / (ప్రొపోజ్డ్) క్వాంటం లైఫ్ యూనివర్శిటీ (QLU) ద్వారా నిర్వహించబడుతున్న ఉచిత సర్టిఫికేషన్ కోర్సు. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. NTAP/QLU వ్యవస్థాపకులైన డాక్టర్ న్యూటన్ కొండవీటి, MD, మరియు డాక్టర్ లక్ష్మీ జి.వి, MBBS గార్లు ఆధ్యాత్మిక శాస్త్రంలో 30 సంవత్సరాలుగా నిర్వహించిన విస్తృతమైన పరిశోధనల నుండి పుట్టిందే సోల్ కోచ్ ప్రోగ్రాం. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది శాస్త్రీయత మరియు ఆధ్యాత్మికత యొక్క మిళితం, మరియు ఇది మెటాఫిజిక్స్, థియాలజీ, సైకాలజీ, పారాసైకాలజీ, ట్రాన్స్పర్సనల్ సైకాలజీ, ఫిలాసఫీ మరియు అనేక ఇతర రంగాలలో విస్తరించి ఉంది.
ఈ శిక్షణా కార్యక్రమంలో, థియరీ మరియు ప్రాక్టికల్స్ ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞాన సాధన గురించి నేర్చుకుంటారు. శారీరక, భావోద్వేగ, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థితుల యొక్క స్వస్థత మరియు పరివర్తనకు సహాయపడే అనేక రకాల ఆచరణాత్మక సాధనాలన్నీ ఈ శిక్షణలో నేర్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమం ప్రపంచంలోనే అద్భుతమైన కార్యక్రమం. ఈ కోర్సులో ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర అంశాలపై జ్ఞానం ఇవ్వబడుతుంది మరియు భౌతిక జీవితంలో ఈ జ్ఞానాన్ని ఎలా ఆచరించాలి అనే దానిపై శిక్షణ ఇవ్వబడుతుంది. మన జీవితంలో ఆధ్యాత్మిక మరియు భౌతిక అంశాలను ఎలా సమతుల్యం చేయాలో SCTP బోధిస్తుంది. ఇది అనుభవపూర్వక అభ్యాసానికి దారితీస్తుంది, ఇది మనలో ఉన్న ఆత్మ విజ్ఞానాన్ని మేల్కొల్పుతుంది. అందువల్ల ఈ కార్యక్రమానికి “సోల్ కోచ్ ట్రన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్” అని పేరు పెట్టారు.
బోధించే అంశాలు:
ఈ శిక్షణలో బోధించే ఆధ్యాత్మిక కోణానికి సంబంధించిన కొన్ని అంశాలు: ఢ్యాన శాస్త్రం, పునర్జన్మ, మృత్యు సమీప అనుభవాలు, ఛానెలింగ్, మూడవ నేత్రం, అతీంద్రియ జ్ఞానం (E.S.P.), కలలు, సూక్ష్మ శరీరయాణం మొదలైనవి. భౌతిక వాస్తవికతకు సంబంధించిన కొన్ని అంశాలు: ఇన్నర్ చైల్డ్, దివ్య జీవన బాంధవ్యాలు, స్పిరిచ్యువల్ ప్రెగ్నెన్సీ, ఆధ్యాత్మిక పిల్లల పెంపకం మరియు సంపూర్ణగా జీవించడం.
(ప్రొపోజ్డ్) క్వాంటం లైఫ్ యూనివర్శిటీలో 3 జ్ఞాన పీఠాలలో (ఇతర విశ్వవిద్యాలయాలలోని కళాశాలల మాదిరిగానే) 18 పాఠశాలలు (ఇతర విశ్వవిద్యాలయాలలోని విభాగాలకు సమానంగా) ఉన్నాయి. SCTP కోర్సు మొత్తం 18 పాఠశాలల నుండి అంశాలను కవర్ చేస్తుంది.
ప్రయోజనాలు:
వారి నిబద్ధత, ప్రమేయం మరియు జిజ్ఞాస స్థాయిలను బట్టి కొంతమందికి తక్షణ ప్రభావం ఉంటుంది. ఈ శిక్షణలో ఆచార్యుల మార్గదర్శకత్వంతో సాధన ద్వారా, లోతుగా సంభవించే మార్పులు మరియు పరివర్తనను అనుభవించగలుగుతారు. ఈ తరగతులన్నింటికీ హాజరు కావడం ద్వారా ఆత్మ జ్ఞానం నేర్చుకుంటారు మరియు ఈ పద్ధతుల యొక్క ఆచరణాత్మక సాధన ద్వారా, ఆత్మ స్థాయి నుండి జీవిస్తారు మరియు చివరికి బ్రహ్మజ్ఞాని అవుతారు (విశ్వ జ్ఞానం సంపాదించినవారు).
వ్యవధి :
ఈ కార్యక్రమం 10 రోజులు నిర్వహించబడే ఉచిత సర్టిఫికేషన్ కోర్సు.
అర్హత:
నేర్చుకోవటానికి ఓపెన్ మైండ్, మరియు ఇచ్చిన జ్ఞానాన్ని శ్రద్ధతో ఆచరించడం తప్ప కోర్సుకు ఎటువంటి ముందస్తు జ్ఞానం లేదా అనుభవం అవసరం లేదు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వారు అన్ని తరగతులకూ హాజరు కావడానికి కట్టుబడి ఉండాలి. ఈ కార్యక్రమంలో చేరడానికి 15 సంవత్సరాల వయస్సు నిండినవారై ఉండాలి.
పరివర్తన:
ఇప్పటి వరకు, 23 SCTP బ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఇందులో హాజరైన చాలా మందికి జీవితంలో అద్భుతమైన పరివర్తనలు జరిగాయి.
పాల్గొనేవారు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు:
ఈ శిక్షణలో పాల్గొనేవారికి వసతి మరియు ఉచిత సాత్వికమైన శాఖాహార భోజనం అందించబడతాయి.
SCTP లో శ్రమదానం (స్వచ్ఛంద సేవ) రూపంలో కర్మ యోగం ఉంటుంది. కోర్సు పూర్తి చేయడానికి పాల్గొనే వారందరూ కర్మ యోగం మరియు జ్ఞాన యోగం రెండింటిలోనూ పాల్గొనాలి.
ఈ కోర్సు మరియు రాత పరీక్ష పూర్తయిన తర్వాత పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
ఈ ఆన్లైన్ ఫారమ్‌ను నింపే ముందు అన్ని పాయింట్లను జాగ్రత్తగా చదవండి. ఈ శిక్షణలో పాల్గొనేవారికి ప్రవేశార్హత కల్పించే హక్కులన్నీ లైఫ్ ఫౌండేషన్ నిర్వాహకుల పరిధిలో ఉంటాయి.
ఏదైనా సమాచారాన్ని దాచడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా నమోదు చేసుకున్నట్లు తేలితే, వారు వెంటనే క్యాంపస్‌ను విడిచి వెళ్ళవలసి ఉంటుంది మరియు పర్యవసానాలేమైనా లైఫ్ ఫౌండేషన్ ఎటువంటి బాధ్యత వహించదు.
సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్‌లో చేరుటకు పాటించవలసిన నియమాలు / నిబంధనలు / సూచనలు / మార్గదర్శకాలు:
* డిప్రెషన్, నిరాశ లేదా ఆత్మహత్య ధోరణులు, బైపోలార్ డిజార్డర్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, స్కిజోఫ్రీనియా లేదా ఇలాంటి ఏ ఇతర సంబంధిత మానసిక సమస్యలు ఉన్నవారు
* నడవలేని వారు మరియు చక్రాల కుర్చీని ఉపయోగించేవారు
* ఇటీవల యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ లేదా ఇతర గుండె శస్త్రచికిత్సలు మరియు గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు
* తీవ్రమైన ఉబ్బసం, రక్తపోటు, మూర్ఛ, క్యాన్సర్ లేదా మరేదైనా క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
* గర్భిణీ స్త్రీలు లేదా ఇటీవల గర్భం దాల్చిన మహిళలు
**సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ని ఉచిత కోర్సుగా అందించడం కొనసాగించడంలో మాకు సహాయం చేయడానికి దయచేసి దిగువ లింక్ ద్వారా మాకు విరాళం ఇవ్వగలరు. Visit QLU donations page!
**లైఫ్ ఫౌండేషన్‌కు చేసే విరాళాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G కింద మినహాయింపు పొందేందుకు అర్హత కలదు
వసతి సౌకర్యాలు:
క్వాంటం లైఫ్ యూనివర్శిటీలో కింది రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి:
i) మోక్షదమ్ డార్మిటరీ - రోజుకు రూ. 500 /- (వ్యక్తికి రూ .5,000 /-)
ii) కైవల్య డార్మిటరీ - రోజుకు రూ. 1200 /- (వ్యక్తికి రూ .12,000 /-)
iii) నిర్వాణ ఇద్ధరు ఉండగలిగే రూములు (పెయిడ్ ట్విన్ షేరింగ్ ) - రూ. రోజుకు 1800 / - (వ్యక్తికి
రూ .18,000 /-)
వసతి సదుపాయాలు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎంచుకున్న వాటిని పరిగణనలోకి తీసుకొని QLU క్యాంపస్ కి వచ్చిన వారిలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన కేటాయించబడుతుంది.
రిపోర్టింగ్ తేదీ మరియు సమయం
ఈ కోర్సుకు హాజరవడానికి మీ ప్రయాణ టికెట్లను ఈ క్రింది విధంగా బుక్ చేసుకోండి:
కోర్సు ప్రారంభమయ్యే ఒక రోజు ముందు సాయంత్రం 4 గంటలలోపు మీరు క్వాంటం లైఫ్ యూనివర్శిటీ క్యాంపస్(వికారాబాద్) కు చేరుకోవాలి. దయచేసి మీ టిక్కెట్లను తదనుగుణంగా బుక్ చేసుకోండి.
14 నవంబర్, 2023 సాయంత్రం 4 గంటల లోపు క్యాంపస్‌కు చేరవలెను. మీ తిరుగు ప్రయాణం టికెట్లను 24 నవంబర్ 2023 సాయంత్రం 3 గంటల తర్వాత బయలుదేరేలా బుక్ చేసుకోండి.
ధ్రువీకరణ
ఈ సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్‌కు నేను ఇష్టపూర్వకంగా హాజరు అవుతున్నాను అనీ, ఆచార్యులు మరియు సేవ మైత్రేయుల అందరినీ గౌరవిస్తాను అనీ తెలియజేస్తున్నాను. ఇదంతా నాయొక్క ధ్యానసాధన, స్వీయ స్వస్థత మరియు ఆధ్యాత్మిక పరిణితి కోసం అనీ, రెసిడెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నా స్వీయ పరివర్తన కోసమే అనీ నేను తెలుసుకున్నాను. ఇంకా ఇది ఏవిధమైన చికిత్సా విధానంకు ప్రత్యామ్నాయం కాదని లేదా సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం శిక్షకులుగా ఇచ్చే శిక్షణ కాదని తెలుసుకున్నాను.
పూర్వజన్మ ప్రతిగమనం, అంతర శిశువు వంటివి స్వయంగా ఇతరులపై ప్రయోగించటానికి ఆయా విభాగాల్లో నైపుణ్యం సాధించే ప్రత్యేక శిక్షణను నేను పొందాలనీ అవగాహన చేసుకున్నాను.
వేదిక:
(ప్రపోజ్డ్) క్వాంటం లైఫ్ యూనివర్శిటీ,
నాగసాన్పల్లి గ్రామం,
కోట్‌పల్లి మండలం,
వికారాబాద్ జిల్లా,
తెలంగాణ - 501106
ఫోన్: 040–42212566
తెలుగు: 8184949723
ఇ – మెయిల్: soulcoach@qluglobal.org || వెబ్సైట్: www.qluglobal.org